Header Banner

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో.. సీఐడి విచారణ కీలక దశలోకి! జోగి రమేష్‌ను నిలదీసిన అధికారులు!

  Fri Apr 11, 2025 14:29        Politics

వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి జోగి రమేశ్ (Former minister Jogi Ramesh) తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) నివాసంపై దాడి కేసులో సిఐడి (CID) విచారణకు (investigation) హాజరయ్యారు. ఆయనతో సహా ఐదుగురు నిందితులు కూడా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు వారిని విచారిస్తున్నారు. కాగా వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రమేష్ భారీ కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ తన అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు.

దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారంొ సీఐడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా జోగి రమేష్‌ను పిలిచారు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయయారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం 20 మందికి పైగా కేసులు నమోదు చేసింది. వీరిలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి చేసే నాటికి జోగి రమేష్ కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కేసులో వారిని ఇప్పటికే పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే దేశం విడిచి వెళ్లొద్దని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Chandrababu #CIDInvestigation #JogiRamesh #TDPvsYCP #AndhraPolitics #CIDProbe